రజనీకాంత్ ‘కూలీ’ స్టోరీ ఇదేనా?

సినిమా డీటెయిల్స్‌ని సీక్రెట్‌గా ఉంచినప్పటికీ, ఆన్‌లైన్‌లో కథ లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని అభిమానులు తెగ ట్రెండింగ్ చేస్తున్నారు.;

By :  K R K
Update: 2025-07-18 12:37 GMT

సూపర్‌స్టార్ రజనీకాంత్, డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ కాంబోలో “కూలీ” అనే భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది. అదే రోజు ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల “వార్ 2” తో బాక్సాఫీస్‌ వద్ద ఢీ కొట్టనుంది. లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ, మాస్టర్, విక్రమ్’ వంటి హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్స్‌కి పెట్టింది పేరు. తన సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటి వరకూ డ్రగ్ ట్రేడ్ చుట్టూ తిరిగే కథలతో ఆడియన్స్‌ని ఫిదా చేశాడు. కానీ, “కూలీ” మాత్రం ఆ టెంప్లేట్‌కి బ్రేక్ వేసి.. ఫ్రెష్ స్టోరీలైన్‌తో వస్తోందని టాక్.

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ ఒక అదిరిపోయే న్యూస్ డ్రాప్ చేశాడు. రజనీకాంత్ ఈ సినిమా స్టోరీని చూసి.. మణిరత్నం డైరెక్ట్ చేసిన కల్ట్ క్లాసిక్ “దళపతి” సినిమాతో పోల్చి మెచ్చుకున్నారట. ఈ విషయం ఫ్యాన్స్‌లో హైప్‌ని డబుల్ చేసింది. నిర్మాతలు సినిమా డీటెయిల్స్‌ని సీక్రెట్‌గా ఉంచినప్పటికీ, ఆన్‌లైన్‌లో కథ లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని అభిమానులు తెగ ట్రెండింగ్ చేస్తున్నారు.

“కూలీ” కథ బంగారం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. రజనీకాంత్ ఓ రిటైర్డ్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ డాన్.. తన పడిపోతున్న సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించడానికి, ప్రతీకార దాహంతో రగిలిపోతూ రీ-ఎంట్రీ ఇస్తాడు. కథలో ట్విస్ట్ ఏంటంటే.. అతడు వింటేజ్ బంగారు గడియారాల్లో దాచిన ఓ స్టోలెన్ టెక్నాలజీని కనుగొంటాడు. ఈ టెక్‌ని ఉపయోగించి.. తన పాత మాఫియా గ్యాంగ్‌ని మళ్లీ ఒక్కటి చేసి.. కోల్పోయిన తన ఎంపైర్‌ని రీక్లెయిమ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ, ఈ మిషన్ అనుకున్నంత సులువు కాదు. ప్రతీకారం, పవర్ గేమ్‌ల మధ్య ఈ ప్లాన్ ఊహించని ప్రమాదకర మలుపులు తిరుగుతుందని టాక్ నడుస్తోంది. 

సినిమా స్టైలిష్ విజువల్స్, హై-స్టేక్స్ డ్రామా, లోకేష్ సిగ్నేచర్ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందుతోంది. రన్‌టైమ్ సుమారు 2 గంటల 50 నిమిషాలు ఉంటుందట. ఈ సినిమాలో నాగార్జున ఆక్కినేని, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రుతి హాసన్ రజనీకాంత్ కూతురు రోల్‌లో కనిపించ నుంది. ఇది కథకి ఎమోషనల్ డెప్త్ యాడ్ చేస్తుందని అంటున్నారు. లోకేష్ రజనీకాంత్‌తో ఈ కాంబో ఫస్ట్ టైమ్ కావడం.. పైగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి డిఫరెంట్ స్టోరీలైన్‌తో రావడంతో ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. “కూలీ” రజనీకాంత్ కెరీర్‌లో మరో ఐకానిక్ మూవీగా నిలుస్తుందా? వెయిట్ అండ్ వాచ్.

Tags:    

Similar News