ధనుష్ కు జోడీగా బుట్టబొమ్మ?

పూజా హెగ్డే ధనుష్ నటిస్తున్న తదుపరి భారీ ప్రాజెక్ట్ అయిన అతడి 54వ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నట్టు టాక్. ఈ సినిమాను విగ్నేష్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు.;

By :  K R K
Update: 2025-07-05 02:24 GMT

టాలీవుడ్ లో వరుసగా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే తన ఫోకస్‌ను కోలీవుడ్ వైపు మళ్లించింది. ఆమె తాజాగా సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం ‘రెట్రో’ లో కథానాయికగా నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయినా.. పూజా ఆగకుండా ముందుకు సాగుతోంది. ఆమె దళపతి విజయ్‌ కి జోడీగా నటించిన ‘జన నాయగన్’ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసింది. ఇది 2026 జనవరి 9న గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది.

ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే.. పూజా హెగ్డే ధనుష్ నటిస్తున్న తదుపరి భారీ ప్రాజెక్ట్ అయిన అతడి 54వ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నట్టు టాక్. ఈ సినిమాను విగ్నేష్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ డ్రామా జోనర్ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ధనుష్ ఇటీవల తెలుగులో ‘కుబేర’ సినిమాతో ప్రేక్షకులను అలరించి.. ఒక హిందీ ఫిల్మ్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశాడు. ఇప్పుడు తన మదర్ వుడ్ అయిన కోలీవుడ్ వైపు ఫుల్ ఫోకస్‌తో వస్తున్నాడు.

ఈ సినిమా అతని కమ్‌బ్యాక్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే.. పూజా హెగ్డే పేరును ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్ మాత్రం ఆమె ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఫైనల్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ గురించి ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారు, మరి ఈ సినిమా పూజా కెరీర్‌లో కొత్త ఊపు తెస్తుందని అంతా ఆశిస్తున్నారు.

Tags:    

Similar News