చాన్నాళ్ళకు మళ్లీ ప్రభుదేవా - వడివేలు !
ఈ కామిక్ డ్యూయో కొత్త ప్రాజెక్ట్‌తో తిరిగి కొలాబరేట్ కానుందనే న్యూస్ అభిమానులను ఫుల్ జోష్‌లోకి తెచ్చేస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఒక్కసారిగా నెట్టింట్లో సందడి చేస్తోంది.;
90లలో 'వైబ్' అనే టర్మ్ ఇంకా ట్రెండ్‌లోకి రాకముందే.. తమ హాస్యంతో ఆ పేరును సొంతం చేసుకుని, ప్రేక్షకులను ఊపేసిన అల్టిమేట్ కామెడీ జోడీ ప్రభుదేవా-వడివేలు మళ్లీ కలిసి రాక్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ కామిక్ డ్యూయో కొత్త ప్రాజెక్ట్‌తో తిరిగి కొలాబరేట్ కానుందనే న్యూస్ అభిమానులను ఫుల్ జోష్‌లోకి తెచ్చేస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఒక్కసారిగా నెట్టింట్లో సందడి చేస్తోంది.
పోస్టర్‌లో ప్రభుదేవా, వడివేలు ఇద్దరూ స్టైలిష్ కౌబాయ్ గెటప్‌లో కనిపిస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. వాళ్ల మొహాలను రివీల్ చేయలేదు. అయినా, ఆ లుక్‌తోనే ఫ్యాన్స్‌ను హైప్ చేసేశారు. పోస్టర్‌లో ట్యాగ్‌లైన్‌గా "వై బ్లడ్ సేమ్ బ్లడ్" అనే ఐకానిక్ డైలాగ్‌ను ఉపయోగించారు. ఈ లైన్ 2001లో వీళ్లిద్దరి సూపర్ హిట్ మూవీ ‘మనదై తిరుడివిట్టై’ నుంచి తీసుకున్నది. ఇది ఫ్యాన్స్‌కు నాస్టాల్జియా కిక్ ఇవ్వడం ఖాయం.
ప్రభుదేవా అండ్ వడివేలు డ్యుయో .. గతంలో ఎన్నో సినిమాల్లో కలిసి మ్యాజిక్ చేశారు. ‘కాదలన్ , లవ్ బర్డ్స్, మిస్టర్ రోమియో, కాదలా కాదలా, మనదై తిరుడివిట్టై , ఎంగల్ అన్నా’ లాంటి సినిమాల్లో వీళ్ల కామెడీ టైమింగ్, కెమిస్ట్రీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అంతేకాదు, ప్రభుదేవా డైరెక్టర్‌గా వ్యవహరించిన పోకిరి , విల్లు సినిమాల్లో కూడా వడివేలు తన కామెడీతో షో స్టీలర్‌గా నిలిచారు. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్‌తో మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద ఈ ఇద్దరి సందడి చూడాలని ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. ఈ కాంబో మళ్లీ ఏం సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరి.