‘కూలీ’ కోసం పూజా హెగ్డే - పాత్రనా? పాటనా?

Update: 2025-02-27 09:34 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ రోల్ లో స్టైలిష్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ‘. ఈ సినిమాలో ఇప్పటికే నాగార్జున, అమీర్ ఖాన్, శ్రుతిహాసన్, ఉపేంద్ర వంటి భారీతారాగణం నటిస్తుంది. వీరితో పాటు లేటెస్ట్ గా పూజా హెగ్డే కూడా ఆన్ బోర్డులోకి వచ్చింది. పూజా హెగ్డే లుక్‌ని రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే పూజా ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తుందా? లేక ప్రత్యేక గీతంంలో మురిపించనుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.





 


గతంలో రజనీకాంత్ ‘జైలర్‘ మూవీ కోసం అనిరుధ్ ‘కావాలయ్య‘ అంటూ సెన్సేషనల్ స్పెషల్ నంబర్ ను ఇచ్చాడు. ఇప్పుడు ‘కూలీ‘లోనూ అలాంటి స్పెషల్ నంబర్ ఉందట. అందుకోసమే పూజా హేగ్డేను తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పూజా హెగ్డే తెలుగులో ‘రంగస్థలం, ఎఫ్ 3‘ వంటి చిత్రాల్లో స్పెషల్ నంబర్స్ లో మురిపించింది. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ‘కూలీ‘ సినిమా ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతుంది

Tags:    

Similar News