తెలుగులో జీరో ప్రమోషన్స్.. జీరో బజ్

తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నప్పటికీ.. ఎలాంటి ప్రమోషన్లు లేవు. పోస్టర్లు, ట్రైలర్లు, ఇంటర్వ్యూలు... ఎలాంటి హైప్ లేదు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా వస్తోంది అన్న ఫీలే కలగడంలేదంటే అతిశయోక్తి కాదు.;

By :  K R K
Update: 2025-04-10 00:08 GMT

టాలీవుడ్‌లో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా పేరుగాంచిన మైత్రి మూవీ మేకర్స్, తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన "గుడ్ బ్యాడ్ అగ్లీ" చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. అజిత్ కు తమిళనాట ఎంతటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. అందుకే.. ఈ సినిమా అక్కడ మంచి ఓపెనింగ్స్ సాధించడం ఖాయం అని భావిస్తున్నారు.

అయితే, ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ చేయాల్సిన ప్రమోషన్ మాత్రం చేసిందే లేదు. పేరు ప్రఖ్యాతులతో ఉన్న సంస్థయి ఉండి కూడా ఈ స్థాయిలో అలసత్వం చూపించడమే ఆశ్చర్యంగా ఉంది. అజిత్ కుమార్ గత చిత్రం ‘విడాముయర్చి’ (తెలుగులో ‘పట్టుదల’) బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాంతో అజిత్ ఈ సినిమా ద్వారా తిరిగి ట్రాక్‌లోకి వస్తాడా? అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. కానీ ఆ ఆసక్తిని క్యాష్ చేసుకునే ప్రయత్నం మైత్రి వారు చేయడంలేదు.

తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నప్పటికీ.. ఎలాంటి ప్రమోషన్లు లేవు. పోస్టర్లు, ట్రైలర్లు, ఇంటర్వ్యూలు... ఎలాంటి హైప్ లేదు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా వస్తోంది అన్న ఫీలే కలగడంలేదంటే అతిశయోక్తి కాదు. తమిళ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించింది. సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ అందించగా, పాటలు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

ఈ నేపథ్యంలో.. ఏకంగా అజిత్ కుమార్ హీరోగా వస్తున్న సినిమా అయినప్పటికీ.. “గుడ్ బ్యాడ్ అగ్లీ” ఈ వారం గురువారం థియేటర్లలోకి ఈ చిత్రం జీరో బజ్ తో రావడం గమనార్హం. సినిమా ఎలా ఉందో వెయిట్ చేసి చూడాల్సిందే… కానీ ప్రమోషన్లు చేయకపోవడం మాత్రం ఈ రోజుల్లో రిస్కే. మరి గుడ్ బ్యాడ్ అగ్లీ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News