సూర్యకు జోడీగా నిధి అగర్వాల్ ?
టాలీవుడ్ లో మూడు సంవత్సరాల విరామం తర్వాత.. అందాల నిధి అగర్వాల్ 2025లో రెండే రెండు పవర్‌ఫుల్ సినిమాలతో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వనుంది. చివరిగా ఆమె అశోక్ గల్లాతో ‘హీరో’ సినిమాలో నటించగా.. ఇప్పుడు ‘ద రాజా సాబ్, హరి హర వీర మల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ vs. స్పిరిట్’ చిత్రాలతో మళ్లీ వెండితెరపై కనిపించబోతోంది. ఇవే కాకుండా.. నిధి తన అభిమానులను మరింత ఉత్సాహపరిచే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఖరారు చేసుకున్నట్లు సమాచారం.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు జోడీగా నటించే అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకుందని వార్తలు వస్తున్నాయి. ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నిధి మరో ప్రముఖ హీరోయిన్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తక్కువ సినిమాల్లో నటించినా.. నిధి ఏకంగా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తన స్టార్‌డమ్‌ను ప్రూవ్ చేసుకుంటోంది.
ప్రస్తుతం నిధి.. భారతీయ సినిమా టాప్ హీరోలైన ప్రభాస్, పవన్ కళ్యాణ్‌లతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ, తన సత్తా ఏమిటో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు చిత్రాలు ఆమె ప్రతిభను, విభిన్న పాత్రలను ప్రదర్శించే విపరీతమైన అవకాశంగా మారనున్నాయి. ఇక కోలీవుడ్ ఎంట్రీ విషయానికి వస్తే, సూర్య సరసన నటించడం ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఈ చిత్రంతో ఆమె దక్షిణ భారతీయ చిత్రసీమలో తన స్థానం మరింత బలపరుచుకోనుంది.