ఒక్క సినిమా విడుదలవలేదు. కానీ లైనప్ అదిరింది !

సాయి అభ్యంకర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న తీరు చూస్తే.. అతను నెమ్మదిగా అడుగులు వేస్తూ సీన్‌లోకి రావడం లేదు. డైరెక్ట్‌గా స్పాట్‌లైట్‌లోకి జంప్ చేస్తున్నాడు.;

By :  K R K
Update: 2025-07-11 01:05 GMT

సాయి అభ్యంకర్... ఈ పేరు ఇంకా థియేటర్లలో మారుమోగలేదు. కానీ ఇండస్ట్రీలో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే, ఈ కుర్రాడు ఏకంగా ఎనిమిది భారీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టుకున్నాడు. అంతే కాదు.. ఇవి సాధారణ సినిమాలు కావు. ఒక్కో సినిమా ఒక్కో స్టార్‌తో, ఒక్కో బిగ్ బ్యానర్‌తో, ఒక్కో హైప్‌తో. లేటెస్ట్‌గా.. కార్తీతో "మార్షల్" సినిమాకు సంగీత బాధ్యతలు తీసుకున్నాడు.

ఒక న్యూకమర్‌కి కార్తీ లాంటి స్టార్‌తో సినిమా స్కోర్ చేసే ఛాన్స్ రావడం అంటే, అతని టాలెంట్‌పై ఫిల్మ్‌మేకర్స్‌కి ఉన్న నమ్మకం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాయి లైనప్ చూస్తే, ఇది కేవలం బిగినర్స్ లక్ అని అనడం కష్టం. సూర్యాతో "కరుప్పు", శివకార్తికేయన్‌తో "యస్కే24", ప్రదీప్ రంగనాథన్‌తో "డ్యూడ్", రాఘవ లారెన్స్‌తో "బెంజ్", రామ్‌కుమార్ బాలకృష్ణన్ డైరెక్షన్‌లో శింబుతో ఓ సినిమా...

అంతేకాదు, అల్లు అర్జున్‌తో అట్లీ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఏఏ22’ లాంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కూడా అతని ఖాతాలో ఉంది. ఇక మలయాళ హీరో షేన్ నిగమ్‌తో "బాల్టీ" కూడా లిస్ట్‌లో ఉంది. ఈ సినిమాల్లో ఒక్కటి కూడా చిన్నది కాదు. ప్రతీ సినిమా ఇండస్ట్రీలో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నవే. సాయి అభ్యంకర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న తీరు చూస్తే.. అతను నెమ్మదిగా అడుగులు వేస్తూ సీన్‌లోకి రావడం లేదు. డైరెక్ట్‌గా స్పాట్‌లైట్‌లోకి జంప్ చేస్తున్నాడు. ఇన్ని స్టార్-స్టడెడ్ ప్రాజెక్ట్‌లు భుజాన వేసుకుని, అతనిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలు సక్సెస్ అవుతాయో, అతడు ఎంతెలా సక్సెస్ అవుతాడో చూడాలి.

Tags:    

Similar News