అనౌన్స్ మెంట్ ఒక్కటే తరువాయి !
అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సై-ఫై బిగ్ బడ్జెట్ మూవీ లో మృణాళ్ ఒక కీలకమైన ఫీమేల్ లీడ్‌గా నటిస్తోందని బజ్ బలంగా వినిపిస్తోంది.;
అందాల హీరోయిన్ మృణాళ్ ఠాకూర్.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా సెన్సేషన్‌గా మారిపోయింది. ఆమె ఒక్కో ఇండస్ట్రీలోనూ తన మార్క్ చూపిస్తూ, సక్సెస్‌ఫుల్ సినిమాలతో అభిమానుల మనసు గెలుచుకుంది. కోలీవుడ్ లో అయితే ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆమె చేసిన ప్రతి ప్రాజెక్ట్‌తో ఆ ఫాలోయింగ్ మరింత పెరుగుతోంది. ఇప్పుడు.. ఆమె తన కెరీర్‌లోనే మోస్ట్ బిగ్గెస్ట్ బ్రేక్‌ను సొంతం చేసుకుంది. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన. అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సై-ఫై బిగ్ బడ్జెట్ మూవీ లో మృణాళ్ ఒక కీలకమైన ఫీమేల్ లీడ్‌గా నటిస్తోందని బజ్ బలంగా వినిపిస్తోంది.
అయితే.. ఈ సినిమా టీమ్ నుంచి ఇంకా అధికారిక అనౌన్స్‌మెంట్ రాలేదు. ఇది ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని మరింత పెంచేస్తోంది. సోర్సెస్ ప్రకారం, మృణాళ్ ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక ప్రమోషనల్ షూట్‌లో పార్టిసిపేట్ చేసింది. వీడియో కూడా రెడీ అయిపోయిందట. కానీ, ఏదో కారణంతో ఆ అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ పోస్ట్‌పోన్ చేశారు. ఈ సినిమా గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటంటే.. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్‌లు ఉంటారని, అందులో ముగ్గురు సీరియస్‌గా క్రూసియల్ రోల్స్‌లో కనిపించనున్నారని టాక్.
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ఈ సినిమాలో ప్రైమరీ ఫీమేల్ లీడ్‌గా ఇప్పటికే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. మృణాళ్ ఠాకూర్ కూడా మరో కీ రోల్‌లో ఉంటుందని ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమా బడ్జెట్ , కాస్టింగ్ , అట్లీ డైరెక్షన్‌తో ఇది ఒక బిగ్ టికెట్ ఎంటర్‌టైనర్ అవుతుందని అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే, మృణాళ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ షూటింగ్‌లో సూపర్ బిజీగా ఉంది. ఒకవైపు తెలుగు, మరోవైపు హిందీ.. ఇలా రెండు ఇండస్ట్రీల్లోనూ ఫుల్ స్వింగ్‌లో రాణిస్తూ, తన టాలెంట్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.