“మూక్కుత్తి అమ్మన్ 2” షూటింగ్ ప్రారంభం
“మూక్కుత్తి అమ్మన్” (“అమ్మోరు తల్లి” - తెలుగు)కి సీక్వెల్‌గా వస్తున్న “మూక్కుత్తి అమ్మన్ 2” షూటింగ్ ఇవాళ చెన్నైలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సెట్ నిర్మాణానికి రూ.1 కోటి ఖర్చు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఈసారి “మూక్కుత్తి అమ్మన్ 2” భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మొత్తం రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ మరియు ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, సుందర్ C దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమాలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తుండగా, దునియా విజయ్, రెజీనా కసాండ్రా, యోగి బాబు, ఉర్వశి, అభినయ, రామచంద్ర రాజు, అజయ్ ఘోష్, సింగంపులి, విచు విశ్వనాథ్, ఇనియా, మైనా నందిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని హిప్ హాప్ ఆది అందిస్తున్నాడు.
ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి, ఈ సీక్వెల్ మొదటి భాగాన్ని మించిపోయేలా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి!