మోహన్ లాల్ - జాకీచాన్ - సింబు... వాటే కాంబో !

తమిళ స్టార్ సింబు హాలీవుడ్ యాక్షన్ ఐకాన్ జాకీ చాన్‌తో కలిసి ఓ కొత్త సినిమా చేయబోతున్నట్టు రిపోర్ట్స్ వెలుగులోకి వస్తున్నాయి. మరింత ఊపు తెచ్చే విషయం ఏంటంటే.. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్.;

By :  K R K
Update: 2025-05-30 04:42 GMT

కోలీవుడ్ లో ఓ సంచలనాత్మక వార్త హల్‌చల్ చేస్తోంది. తమిళ స్టార్ సింబు హాలీవుడ్ యాక్షన్ ఐకాన్ జాకీ చాన్‌తో కలిసి ఓ కొత్త సినిమా చేయబోతున్నట్టు రిపోర్ట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మలయాళ హిట్ సినిమాల డైరెక్టర్ జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ వార్తకు మరింత ఊపు తెచ్చే విషయం ఏంటంటే.. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్.

ఈ సినిమా కథ, టైటిల్, జానర్ లేదా ఇతర డీటెయిల్స్ గురించి ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అయితే.. ఇంత భారీ స్థాయిలో సింబు, మోహన్‌ లాల్‌లతో పాటు గ్లోబల్ యాక్షన్ స్టార్ జాకీ చాన్ కలిసి ఒకే సినిమాలో కనిపించ నున్నారనే వార్తే సినీ లవర్స్‌లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఈ క్రాస్-బోర్డర్ కొలాబరేషన్ ఒకవేళ నిజమైతే.. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ఐకానిక్ మైలురాయిగా నిలిచిపోవచ్చు.

జూడ్ ఆంథనీ జోసెఫ్.. ‘2018’ వంటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డైరెక్టర్‌గా, ఈ ప్రాజెక్ట్‌కు తనదైన స్టైల్‌ను తీసుకొస్తారని అంచనా. సింబు తన వైవిధ్యమైన పాత్రలతో, జాకీ చాన్ తన సిగ్నేచర్ యాక్షన్ స్టంట్స్‌తో, మోహన్‌లాల్ తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను ఏ స్థాయిలో తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News