‘లియో’ ప్రభావం... మాథ్యూ థామస్‌ జోరు

విజయ్ కొడుకుగా నటించిన మాథ్యూ థామస్‌ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.;

By :  K R K
Update: 2025-01-24 05:11 GMT

తమిళ దళపతి విజయ్, త్రిష జోడీగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లియో' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇందులో విజయ్ కొడుకుగా నటించిన మాథ్యూ థామస్‌ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. మాలీవుడ్ కు చెందిన ఈ యువ నటుడు గతంలో అనేక సినిమాల్లో నటించినప్పటికీ.. ‘లియో’ చిత్రం తరువాత అతడి ఫేట్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాతో మాథ్యూ తమిళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను కూడా తన నటనతో మెప్పించాడు.

‘లియో’ విజయం తరువాత... మాథ్యూ వరుసగా తమిళ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబం' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ధనుష్ మేనల్లుడు ఒక హీరోగా నటిస్తుండగా.. మరో హీరోగా మాథ్యూ కనిపించనున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కూడా లియో ఇచ్చిన గుర్తింపును మరింతగా పెంచుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

తమిళంతో పాటు మలయాళంలోనూ మాథ్యూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నాడు. ఫిబ్రవరి నెలలోనే అతడు నటించిన మరో మలయాళ సినిమా విడుదల కానుంది. ఒకే నెలలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మాథ్యూ, ప్రస్తుతం ప్రతిష్టాత్మక పాత్రల కంటే హీరో పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు.

టీనేజ్ కథలతో చిన్న సినిమాల దర్శకులు అతడిని సంప్రదిస్తున్నట్లు మలయాళ మీడియా కథనాలు వెల్లడించాయి. అంతేకాక, అతడి సోషల్‌ మీడియా ఫాలోయింగ్ కూడా గణనీయంగా పెరిగింది. ఈ లెక్కన తమిళం, మలయాళంలో ఆకట్టుకున్న మాథ్యూ భవిష్యత్తులో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించడానికి సిద్ధమవుతాడేమో చూడాలి. 

Tags:    

Similar News