షూటింగ్ లో ప్రమాదం... స్టంట్ ఆర్టిస్ట్ దుర్మరణం

ఆర్య, పా. రంజిత్ సినిమా 'సర్పట్ట పరంబరై' సీక్వెల్‌గా రూపొందుతోందుతోన్న సినిమా షూటింగ్ లోనే రాజు చనిపోయారు.;

By :  K R K
Update: 2025-07-14 05:52 GMT

ఆర్య హీరోగా... పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్‌లో హై-రిస్క్ కారు టాప్లింగ్ స్టంట్ చేస్తూ ప్రముఖ స్టంట్ ఆర్టిస్ట్ యస్.యం.రాజు ఆదివారం ఉదయం దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. అతడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పనిచేశాడు. ఆర్య, పా. రంజిత్ సినిమా 'సర్పట్ట పరంబరై' సీక్వెల్‌గా రూపొందుతోందుతోన్న సినిమా షూటింగ్ లోనే రాజు చనిపోయారు. ఈ సినిమా 2026లో విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

రాజుతో ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేసిన నటుడు విశాల్, ఈ బాధాకరమైన వార్తను నిర్ధారిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో భావోద్వేగ సందేశం పంచుకున్నారు "స్టంట్ ఆర్టిస్ట్ రాజు కారు టాప్లింగ్ సీక్వెన్స్ చేస్తూ చనిపోయారనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం,...’ అని విశాల్ రాశారు. "రాజు చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు. అతను నా సినిమాల్లో ఎన్నో ప్రమాదకర స్టంట్లు చేశాడు. అతను చాలా ధైర్యవంతుడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను... అని తన బాధను వ్యక్తం చేశారు విశాల్.

రాజు కుటుంబానికి దీర్ఘకాలిక మద్దతు అందిస్తానని విశాల్ హామీ ఇచ్చారు. "ఈ గొప్ప నష్టాన్ని భరించే శక్తిని దేవుడు అతని కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటున్నాను," అని ఆయన తెలిపారు. "కేవలం ఈ ట్వీట్‌తో సరిపోదు. రాజు కుటుంబ భవిష్యత్తుకు నేను ఖచ్చితంగా అండగా ఉంటాను. నా హృదయం నుంచి, నా బాధ్యతగా, వారికి నా పూర్తి మద్దతు అందిస్తున్నాను...’’ అని విశాల్ తెలిపారు.

ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ స్టంట్ సిల్వా కూడా రాజు మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆయన ఇలా రాశారు... "మన గొప్ప కారు జంపింగ్ స్టంట్ ఆర్టిస్ట్ ఎస్.ఎం. రాజు, కారు స్టంట్ చేస్తూ ఈ రోజు మర ణించారు. మన స్టంట్ యూనియన్ కు, భారతీయ సినీ పరిశ్రమ కు అతని మరణం తీరని లోటు..’’ అని సిల్వా తెలిపాడు.

Tags:    

Similar News