వివాదాల ఉచ్చులో ‘డ్రాగన్’ బ్యూటీ

టాస్మాక్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల జరిపిన రైడ్‌లో.. కొందరు వ్యక్తులు హై-ప్రొఫైల్ నైట్ పార్టీలకు హాజరు కావడానికి కాయదు లోహార్‌కు రూ. 35 లక్షలు చెల్లించినట్టు తేలింది.;

By :  K R K
Update: 2025-05-23 09:51 GMT

బ్యూటిఫుల్ హీరోయిన్ కాయదు లోహార్ తన ఇటీవలి బ్లాక్‌బస్టర్ సినిమా ‘డ్రాగన్’ తో తెలుగు, తమిళ యూత్‌లో క్రేజీ క్రష్‌గా మారింది. సినిమా సక్సెస్ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్ నుంచి ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఇప్పుడు ఆమె టాస్మాక్ స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులతో లింక్‌ కారణంగా చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది.

టాస్మాక్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల జరిపిన రైడ్‌లో.. కొందరు వ్యక్తులు హై-ప్రొఫైల్ నైట్ పార్టీలకు హాజరు కావడానికి కాయదు లోహార్‌కు రూ. 35 లక్షలు చెల్లించినట్టు తేలింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. ఆమె అభిమానులను షాక్‌లో ముంచెత్తింది. ఈ వార్త తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చీకటి కోణాలు, అక్రమ కార్యకలాపాలతో లింకులపై చర్చలను రేకెత్తించింది.

టాస్మాక్ స్కామ్ అనేది తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్‌లో జరిగిన భారీ ఆర్థిక మోసం. ఇది రాష్ట్రంలో మద్యం డిస్ట్రిబ్యూషన్‌ను నిర్వహిస్తుంది. ఈడీ దర్యాప్తులో రూ. 1000 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు, ఊహించని టెండర్లు, డిస్టిలరీలు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్‌లతో సంబంధం ఉన్న లంచాలు బయటపడ్డాయి. మరి ఈ వివాదం నుంచి కయదు లోహర్ ఎలా బైట పడుతుందో చూడాలి.

Tags:    

Similar News