కార్తీ.. రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ!

ఈ సినిమాలో కార్తి ప్రధాన పాత్రలో నటించడంతో పాటు, ఒకప్పటి తమిళ స్టార్ కమెడియన్ వడివేలు కూడా కీలక పాత్రలో కనిపించ బోతున్నాడు.;

By :  K R K
Update: 2025-02-09 00:37 GMT

తమిళ స్టార్ హీరో కార్తి తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపా దించుకున్నాడు. ఆయన సినిమాలు తెలుగులో మంచి మౌత్ టాక్ వస్తే మంచి వసూళ్లు సాధిస్తాయి. తాజాగా.. కార్తి 29 వర్కింగ్ టైటిల్ తో కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని తమిళ్ అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తుండగా... ఇది పూర్తిగా రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని సమాచారం. ఈ సినిమాలో కార్తి ప్రధాన పాత్రలో నటించడంతో పాటు, ఒకప్పటి తమిళ స్టార్ కమెడియన్ వడివేలు కూడా కీలక పాత్రలో కనిపించ బోతున్నాడు.

దర్శకుడు తమిళ్ తన సినిమాలను పూర్తిగా తమిళ నేటివిటీతో తీర్చిదిద్దే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందువల్ల ఈ సినిమా తెలుగు జనానికి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ముఖ్యంగా.. ఇలాంటి తమిళ నేటివిటీ ఉన్న చిత్రాలకు తెలుగులో అంతగా ఆదరణ ఉండకపోవచ్చు. అయితే.. మల్టీప్లెక్స్ ప్రేక్షకుల దృష్టిని మాత్రం ఈ సినిమా ఆకర్షించగల అవకాశం ఉంది.

కార్తి చాలా కాలం తర్వాత ఈ రా అండ్ రస్టిక్ జానర్‌కి వస్తుండటంతో, ఇది నటుడిగా ఆయనకు కొత్త ఛాలెంజ్ కానుంది. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ సినిమా 2025 చివరి నాటికి థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది.

Tags:    

Similar News