కోలీవుడ్ లో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోందా?
ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కించనున్న ఓ వెబ్‌సిరీస్‌లో జాన్వీ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. మహిళా ప్రాధాన్య కథాంశంతో రూపొందుతున్న ఈ సిరీస్ లో అణచివేత, సామాజిక సమస్యలు కీలకాంశాలుగా ఉండనున్నాయి.;
బాలీవుడ్‌లో దూసుకుపోతున్న అందాల హీరోయిన్ జాన్వీ కపూర్ ఇప్పుడు మరో విశేషమైన ప్రాజెక్ట్‌తో వార్తల్లోకెక్కింది. భాషాభేదం లేకుండా దక్షిణాది అగ్రతారల సరసన వరుసగా అవకాశాలు అందుకుంటూ తన ప్రత్యేకతను నిరూపించు కుంటున్న ఈ అందగత్తె ఇప్పుడు తమిళ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతోంది.
ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కించనున్న ఓ వెబ్‌సిరీస్‌లో జాన్వీ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. మహిళా ప్రాధాన్య కథాంశంతో రూపొందుతున్న ఈ సిరీస్ లో అణచివేత, సామాజిక సమస్యలు కీలకాంశాలుగా ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టుపై గత కొన్ని నెలలుగా పా.రంజిత్‌తో చర్చలు జరుపుతోందని.. జులై నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని జాన్వీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం జాన్వీ ‘పెద్ది’, ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ తమిళ వెబ్‌సిరీస్‌తో జాన్వీ ప్రయాణంలో మరో మైలురాయి చేరనుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. త్వరలో ‘పరమ్ సుందరి’గా తన సత్తా చూపేందుకు జాన్వీ రెడీ అవుతోంది. మరి జాన్వీకి ఈ వెబ్ సిరీస్ ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.