కేరళలో మొదలు కాబోతున్న ‘జైలర్ 2’ షూటింగ్ !
కేరళలోని అట్టప్పాడి ప్రాంతం వాతావరణం, అక్కడి కొండలు, ప్రకృతి రమణీయత అన్నీ ‘జైలర్ 2’ కథలో ఓ పాత్రలా మారబోతున్నాయి. ఈ ప్రాంతాన్ని ఎంచు కోవడం వెనుక నిజంగా ఒక ఆర్టిస్టిక్ విజన్ ఉంది.;
తెలుగు ప్రేక్షకుల్లోనే కాక, దేశవ్యాప్తంగా సినిమా ప్రియులందరిలోనూ ఉత్కంఠను రేపుతున్న చిత్రం "జైలర్ 2". మొదటి భాగం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రజనీకాంత్ మళ్ళీ జైలర్ గా కనిపించ బోతున్నారన్న వార్త చాలు.. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పడానికి.
ఈ సారి కథను మరో కొత్త కోణంలో మలచడానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను కొద్దిరోజుల్లోనే మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. తొలి షెడ్యూల్ ను 35 రోజుల పాటు .. కేరళలోని అట్టప్పాడి అనే ప్రకృతి రమణీయ ప్రాంతంలో జరుగబోతోంది. ఈ నేపథ్యం ఈ కథకు అవసరమైన భావోద్వేగాలను, విజువల్ ట్రీట్ ను అందించబోతోంది.
"జైలర్" ఒక యాక్షన్ డ్రామా మాత్రమే కాదు.. ఇందులోని పాత్రలే దీని బలం. ఈ సారి దర్శకుడు రజనీకాంత్ పాత్రకు మరింత లోతు, మానవీయతను జోడిస్తున్నారని సమాచారం. కథలో ఉండే కొత్త మలుపులు, కొత్త శత్రువులు, కొత్త సమస్యలు అన్నీ కలిసి ఈ కొత్త జైలర్ కథాంశంపై మంచి ప్రభావం చూపుతాయని మేకర్స్ చెబుతున్నారు. కథ ఎంత బలంగా ఉంటే, సినిమా అంత శక్తివంతంగా నిలబడుతుంది.
కేరళలోని అట్టప్పాడి ప్రాంతం వాతావరణం, అక్కడి కొండలు, ప్రకృతి రమణీయత అన్నీ ‘జైలర్ 2’ కథలో ఓ పాత్రలా మారబోతున్నాయి. ఈ ప్రాంతాన్ని ఎంచు కోవడం వెనుక నిజంగా ఒక ఆర్టిస్టిక్ విజన్ ఉంది. ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, సంగీతం అన్నీ కలిసొచ్చి, ఈ చిత్రానికి ఒక ప్రత్యేక శైలిని కలిగించబోతున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్‌కు ఉన్న విజువల్ సెన్సిబిలిటీ ఈ కథకు అత్యద్భుతంగా కుదరబోతోందని చెప్పవచ్చు.