అజిత్ 64వ చిత్రానికి డైరెక్టర్ ఇతడేనా?

By :  T70mm Team
Update: 2025-02-26 06:54 GMT


కొలీవుడ్ స్టార్ అజిత్ తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘విడాముయర్చి’ ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మాదిరి కలెక్షన్లు సాధించి.. సాధారణ హిట్‌గా నిలిచింది. అయితే అజిత్ అభిమానులు ఇప్పుడు ఆయన తదుపరి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా.. అజిత్ 64వ చిత్రంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకులు ప్రశాంత్ నీల్, లోకేశ్ కనగరాజ్, సిరుతై శివ, వెంకట్ ప్రభు, కార్తిక్ సుబ్బరాజ్‌ల పేర్లు ఈ చిత్రానికి సంబంధించి చర్చల్లో ఉన్నాయి. అయితే, కోలీవుడ్ సమాచారం ప్రకారం.. కార్తిక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం అజిత్ స్పెయిన్‌లో మోటార్ రేసింగ్ పోటీలో పాల్గొంటున్నారు. మరోవైపు, కార్తిక్ సుబ్బరాజ్ తన తాజా చిత్రం.. సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘రెట్రో’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ‘AK64’ ప్రాజెక్ట్‌పై ఉన్న అనుమానాలు తొలగి, అధికారిక ప్రకటన వచ్చే వరకు అజిత్ అభిమానులు వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News