'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్.. ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్ట్!

Update: 2025-02-28 14:40 GMT

తమిళ తల అజిత్ కుమార్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీలో అజిత్ కి జోడీగా త్రిష నటిస్తుంది. లేటెస్ట్ గా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నుంచి మోస్ట్ అవైటింగ్ టీజర్ వచ్చేసింది.



Full View


టీజర్ ను పరిశీలిస్తే.. స్టైలిష్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న అజిత్ ఈ చిత్రంలో తనదైన శైలిలో మరో అదిరిపోయే పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అజిత్ పాత్రలో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు భిన్నంగా ఇందులోని మేకోవర్స్ కనిపిస్తున్నాయి. అజిత్ న్యూ లుక్, యాక్షన్ సీక్వెన్సెస్ ఈ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. ఇక అజిత్ నుంచి అభిమానులు ఏ ఏ అంశాలు కోరుకుంటారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఈ మూవీలో ఉన్నట్టు టీజర్ ను బట్టి అర్థమవుతుంది.

మరోవైపు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ మ్యూజిక్ డైరెక్టర్ విషయంపైనా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఏప్రిల్ 10న గ్రాండ్ లెవెల్ లో ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ ఏడాది 'విడాముయార్చి'తో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన అజిత్ 'గుడ్ 

Tags:    

Similar News