ఫహద్ ఫాసిల్, వడివేలు మూవీ వచ్చేది అప్పుడే !
2023లో విడుదలైన మరియా సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మామణ్ణన్’ చిత్రం తర్వాత ఫహద్ ఫాసిల్, వడివేలు మళ్లీ కలిసి నటిస్తున్న సినిమా ఇది.;
మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్, తమిళ వెర్సటైల్ నటుడు వడివేలు మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘మారీసన్’. 2023లో విడుదలైన మరియా సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మామణ్ణన్’ చిత్రం తర్వాత ఫహద్ ఫాసిల్, వడివేలు మళ్లీ కలిసి నటిస్తున్న సినిమా ఇది. మామణ్ణన్ బాక్సాఫీస్ విజయంతో పాటు వారి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా జులై 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
సుధీష్ శంకర్ దర్శకత్వంలో వి. కృష్ణమూర్తి రాసిన స్క్రీన్‌ప్లే ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇది సుధీష్ శంకర్‌కు తమిళంలో రెండవ దర్శకత్వ చిత్రం. ఇంతకు ముందు 2009లో ‘ఆరుమనమే’ తెరకెక్కించాడు. ఈ చిత్రంలో వివేక్ ప్రసన్న ఫహద్ స్నేహితుడి పాత్రలో, పిఎల్ తేనప్పన్, కోవై సరళ పోలీసులుగా నటిస్తున్నారు. ఇంకా సితార, లివింగ్‌స్టన్, సరవణ సుబ్బయ్య, రేణుక, కృష్ణ, టెలిఫోన్ రాజా, హరిత ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
యువన్ శంకర్ రాజా సంగీత సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి తన సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నారు. ట్రైలర్ ను బట్టి.. ఈ సినిమా ఒక సరదా రోడ్ ట్రిప్ చిత్రంగా అనినిపిస్తుంది. కానీ తర్వాత థ్రిల్లర్ గా మలుపు తిరుగుతుంది. మరి ఈ సినిమాతో ఫహద్ అండ్ వడివేలు ఇంకెంతగా పేరు తెచ్చుకుంటారో చూడాలి.