‘జైలర్ 2’ గురించి అదిరిపోయే అప్డేట్ !
నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.;
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న "జైలర్ 2" సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కేరళలో ఈ యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ సమయంలో రజనీ తరచూ అభిమానులను కలవడం, వారు ఆయనను కలిసేందుకు భారీగా రావడం మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే.. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ఫహద్ ఫాజిల్ చేరికపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. "పుష్ప 2"తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫహద్ ఈ సినిమాలో ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారని టాక్. తెలిపే విషయమేంటంటే, ఫహద్ ఫాజిల్ ఇప్పటికే రజనీకాంత్‌తో కలిసి ఒక సినిమా చేశాడు. అదే 2024లో వచ్చిన ‘వేట్టైయన్’. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ‘జైలర్ 2’ విషయానికొస్తే.. ఇది 2023లో వచ్చిన సూపర్ హిట్ సినిమా జైలర్ కు సీక్వెల్.
ఇందులో రజనీకాంత్ తిరిగి తన ఐకానిక్ పాత్ర ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. రమ్యకృష్ణ, ఎస్.జె. సూర్య, యోగి బాబు, మిర్నా మీనన్, శివరాజ్‌కుమార్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా రజనీకాంత్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.