సినీరంగంలోకి క్రికెటర్ సురేశ్ రైనా !

భారత్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఓ సినిమాలో నటుడిగా తొలిసారి కనిపించనున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు;

By :  K R K
Update: 2025-07-05 04:08 GMT

క్రికెట్ మైదానంలో సుదీర్ఘ అనుభవాన్ని గడించిన.. బ్యాట్స్ మేన్ సురేష్ రైనా ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నాడు. అతడు ఓ తమిళ సినిమాలో నటుడిగా తొలిసారి కనిపించనున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ విషయాన్ని క్రికెటర్ శివమ్ దూబే చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వీడియో ద్వారా ప్రకటించారు. ఈ సినిమాను లోగన్ డైరెక్ట్ చేస్తున్నాడు. డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది. డి. శరవణ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఆస్కార్ విజేత రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనర్‌గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. సురేష్ రైనా 2005లో వన్డే ఇంటర్నేషనల్, 2006లో టీ20, 2010లో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అతడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, రైట్ ఆర్మ్ ఆఫ్-స్పిన్ బౌలర్‌గా రాణించాడు. 2011 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. 2020 ఆగస్టు 15న ఆయన క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Tags:    

Similar News