ప్లాపులొస్తున్నా సూపర్ స్టార్స్ సరసన అవకాశాలు!

Update: 2025-07-08 05:40 GMT

టాలెంటెడ్ అండ్ గ్లామరస్ నటీమణి పూజా హెగ్డే, ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించింది. అయితే, గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్‌లు ఎదుర్కొనడంతో ఆమె కెరీర్‌కు సీరియస్‌గా డ్యామేజ్ జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆమె కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నారు, కానీ పూజా హెగ్డే తన టాలెంట్, డెడికేషన్‌తో ఆ అంచనాలను తలకిందులు చేస్తూ, మళ్లీ టాప్ గేర్‌లోకి వచ్చేసింది. ఇటీవల సూర్యా నటించిన ‘రెట్రో’ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించి, తన కెరీర్‌ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. కానీ అంతగా వర్కౌట్ కాలేదు.

అయినప్పటికీ పూజా... ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ స్టార్ దళపతి విజయ్‌తో కలిసి భారీ రాజకీయ నేపథ్య చిత్రం 'జననాయగన్' లో నటిస్తోంది. ఈ సినిమా, తమిళ సినిమా రంగంలో ఇటీవలి కాలంలో అత్యంత హైప్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం గురించి అభిమానుల్లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ స్కై-హై లెవెల్‌లో ఉన్నాయి. పూజా ఈ సినిమాలో తన పాత్రతో మరోసారి సంచలనం సృష్టించే అవకాశం ఉంది. అంతటితో ఆగకుండా, పూజా హెగ్డే మరో భారీ ప్రాజెక్ట్‌ను లాక్ చేసుకుందని లేటెస్ట్ బజ్.

ఈసారి ఆమె మరో తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్‌తో స్క్రీన్ షేర్ చేయబోతోంది. ఈ కొత్త సినిమా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. దర్శకుడు, టెక్నికల్ టీమ్, ఇతర వివరాల గురించి అధికారిక ప్రకటనలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ టీమ్ కాస్టింగ్ విషయంలో ఫైనల్ టచ్‌లు ఇస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వరుస ఫ్లాప్‌ల తర్వాత కూడా పూజా ఇంకా స్టార్ హీరోలతో భారీ సినిమాలు సైన్ చేయగలుగుతోంది. దీనికి కారణం ఆమె అసాధారణ గ్లామర్, స్క్రీన్‌పై ఆకర్షణ, ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించే స్టార్ పవర్. పూజా హెగ్డే ఈ రీతిలో బ్యాక్-టు-బ్యాక్ స్టార్ హీరోల సినిమాలతో బిజీగా మారడం, ఆమెలో ఇంకా చాలా టాలెంట్ మిగిలి ఉందని, ఆమె కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్ ఇంకా బలంగా సాగుతుందని స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News