సూర్య ‘రెట్రో’ నుంచి ఎమోషనల్ మెలోడీ!
By : Surendra Nalamati
Update: 2025-03-04 11:29 GMT
కోలీవుడ్ స్టార్ సూర్య లేటెస్ట్ మూవీ ‘రెట్రో‘. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
ఆమధ్య విడుదలైన ‘రెట్రో‘ టీజర్ లో సూర్య ప్రేమికుడిగా, గ్యాంగ్ స్టర్ గా డిఫరెంట్ మేకోవర్స్ లో కనిపించాడు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘కన్నుల్లోనా‘ అంటూ సాగే మెలోడీ రిలీజయ్యింది. జైలులో ఖైదీగా ఉన్న సూర్య.. తన ప్రేయసి కోసం పాడుకునే గీతమిది. ఈ విరహ గీతాన్ని తనదైన శైలిలో మెలోడియస్ గా కంపోజ్ చేశాడు సంతోష్ నారాయణన్. కాశర్ల శ్యామ్ రాసిన ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించాడు. మే 1న ‘రెట్రో‘ థియేటర్లలోకి రానుంది.