సూర్య పాత్రను రివీల్ చేసిన వెంకీ అట్లూరి

సూర్య క్యారెక్టర్‌లో 'గజినీ' సినిమాలోని సంజయ్ రామస్వామి పాత్రకు సమానమైన షేడ్స్ ఉంటాయని కూడా హింట్ ఇచ్చారు. ఇది ఫ్యాన్స్‌లో హైప్‌ను మరింత పెంచింది.;

By :  K R K
Update: 2025-06-29 01:31 GMT

వెంకీ అట్లూరి, తమిళ స్టార్ హీరో సూర్య కాంబోలో ఒక ఆసక్తికరమైన సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ షేర్ చేశాడు డైరెక్టర్ వెంకీ. ఇది సూర్య కెరీర్‌లో ఒక గేమ్-ఛేంజర్‌గా నిలవనుంది. ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెంకీ మాట్లాడుతూ.. "సూర్య 46వ చిత్రం ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుంది. డీప్ ఎమోషన్స్‌తో నిండిన హ్యూమన్ టచ్ ఉంటుంది" అని చెప్పారు. సూర్య క్యారెక్టర్‌లో 'గజినీ' సినిమాలోని సంజయ్ రామస్వామి పాత్రకు సమానమైన షేడ్స్ ఉంటాయని కూడా హింట్ ఇచ్చారు. ఇది ఫ్యాన్స్‌లో హైప్‌ను మరింత పెంచింది.

ఈ సినిమా షూటింగ్ ఈ జూన్‌లో స్టార్ట్ అయింది. మలయాళ సినిమా 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు ఈ చిత్రంలో కీలక రోల్‌లో కనిపించనుంది. సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.

ఇక సినిమా స్టోరీ విషయానికొస్తే, సూర్య 46 ఒక బయోగ్రాఫికల్ డ్రామాగా ఉండొచ్చని బజ్ జోరందుకుంది. మారుతి 800 కారు ఉత్పత్తిలో క్రిటికల్ రోల్ పోషించిన ఒక రియల్-లైఫ్ ఫిగర్ జీవితం నుండి ఇన్‌స్పిరేషన్ తీసుకున్న కథ అని రూమర్స్. ఒకవేళ ఇదే నిజమైతే, భారత పారిశ్రామిక చరిత్రలో ఐకానిక్ వ్యక్తిని సూర్య స్క్రీన్‌పై పోషించడం ఫ్యాన్స్‌కు ఓ యూనిక్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. మరోవైపు.. సూర్య తన 45వ చిత్రం 'కరుప్పు'లో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఆర్‌జే బాలాజీ డైరెక్ట్ చేస్తుండగా, త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

Tags:    

Similar News