‘ఇడ్లీకడై’ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ఇదే !
ఈ సినిమా విడుదలను ఏకంగా ఆరు నెలల పాటు వాయిదా వేస్తూ, కొత్తగా అక్టోబర్ 1న విడుదల చేస్తామని ప్రకటించారు.;
కోలీవుడ్ స్టార్ హీరో, దర్శకుడు ధనుష్ ఇప్పుడు ఓవర్లోడ్ మోడ్‌లో ఉన్నాడు. యాక్టింగ్, డైరెక్షన్ అంటూ రెండు చేతులా సినిమాలు చేస్తూ బాలీవుడ్, కోలీవుడ్ అనే భేదం లేకుండా పని చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో 'కుబేర', తమిళంలో 'ఇడ్లీ కడాయ్', బాలీవుడ్‌లో 'తేరీ ఇష్క్ మే' సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇప్పుడు దర్శకుడిగా ధనుష్ హ్యాండిల్ చేస్తున్న తదుపరి సినిమా 'ఇడ్లీకడై'. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేస్తామని చాలా ముందే ధనుష్ ప్రకటించాడు. అయితే అనుకోని టర్న్ ఒకటి తీసుకుంది. అదే రోజున తమిళ స్టార్ అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా కూడా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో రెండు పెద్ద సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదన్న టాక్ ఇండస్ట్రీలో స్పీడుగా వెళ్తోంది.
అయితే ఊహించని విధంగా సీన్ కి కొత్త ట్విస్ట్ ఇచ్చాడు ధనుష్. ‘ఇడ్లీకడై’ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, అందుకే అనుకున్న తేదీన సినిమా విడుదల చేయలేమని ధనుష్ స్పష్టంగా ప్రకటించాడు. దీంతో ఈ సినిమా విడుదలను ఏకంగా ఆరు నెలల పాటు వాయిదా వేస్తూ, కొత్తగా అక్టోబర్ 1న విడుదల చేస్తామని ప్రకటించారు.
ఈ నిర్ణయంతో అజిత్ చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కి ఊహించని బోనస్ దొరికింది. ఏప్రిల్ 10న సోలో రిలీజ్ దొరకడంతో, సినిమాకు భారీ ఓపెనింగ్ దక్కే అవకాశాలు బలపడిపోయాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్‌పై ఆ సినిమాకు దూసుకెళ్లే దారి సాఫీగా మారినట్టే అని సినీ వర్గాల వారు అభిప్రాయ పడుతున్నాయి.