ధనుష్ ‘ఇడ్లీకడై’ మూవీ షూటింగ్ పూర్తి
ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత ఆకాష్ బాస్కరన్, సహ నటులతో కలిసి ధనుష్ తీసుకున్న ఫోటోలు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.;
ప్రస్తుతం తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాల జాబితా కోలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం అతడు హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మేన్ షూటింగ్‌లో ఉండగా... శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేరా’, ఇంకా తను స్వీయ దర్శకత్వం వహిస్తున్న ‘ఇడ్లీకడై’ కూడా లైనప్‌లో ఉన్నాయి. ‘ఇడ్లీకడై’ విషయానికి వస్తే... ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత ఆకాష్ బాస్కరన్, సహ నటులతో కలిసి ధనుష్ తీసుకున్న ఫోటోలు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫోటోల్లో ధనుష్ బ్రౌన్ స్వెట్ట్షర్ట్, వైట్ ట్రౌజర్స్ ధరించి చిరునవ్వుతో కనిపించాడు. ఇక ‘ఇడ్లీకడై’ గురించి చెప్పాలంటే... మొదట ఈ సినిమా విడుదల తేదీ ఏప్రిల్ 10గా ఖరారు చేయబడింది. కానీ అదే రోజు అజిత్ కుమార్ సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదల కావడంతో, పోటీని నివారించడానికి మేకర్స్ దీని విడుదలను 2025 దీపావళి సందర్భానికి మార్చారు.
ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న నాలుగో సినిమా అయిన ‘ఇడ్లీకడై’ లో నిత్యా మీనన్, అరుణ్ విజయ్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, సత్యరాజ్, పార్థిబన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.