‘ఇడ్లీకడై’ ఓటీటీ రైట్స్ పై తాజా అప్డేట్ !

"ఇడ్లీకడై" డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 45 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం.;

By :  K R K
Update: 2025-03-31 01:24 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన దర్శకత్వ ప్రతిభతో వరుస విజయాలను అందుకుంటూ వెళ్తున్నాడు. అతని గత చిత్రం "నీక్" సూపర్ హిట్ కావడంతో, అభిమానులు ఇప్పుడు అతని నాలుగో దర్శకత్వ చిత్రం "ఇడ్లీకడై" కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతుండగా.. ఓటీటీ రైట్స్ గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

"ఇడ్లీకడై" డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 45 కోట్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక విడుదల తేదీ విషయానికి వస్తే... ముందుగా ఏప్రిల్ 10, 2025 గా ప్రకటించినప్పటికీ, ప్రస్తుతానికి ఈ సినిమాను వాయిదా వేశారు. చిత్ర నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, ఇంకా కొన్ని సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉందని తెలిపారు.

ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. అతడు ధనుష్ తో తలపడే కీలక ఘట్టం సినిమా హైలైట్ కానుందని మేకర్స్ చెబుతున్నారు. ఆసక్తికరంగా.. "ఇడ్లీకడై" అనే టైటిల్ ధనుష్ సొంత ఆలోచన అని కూడా తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ తో పాటు .. ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న "కుబేరా", అలాగే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలోని "తేరే ఇష్క్ మే" సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక, "ఇడ్లీకడై" విడుదల తేదీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. తెలుగులో ఈ సినిమా ‘ఇడ్లీకొట్టు’ గా రాబోతోంది. 

Tags:    

Similar News