ధనుష్ గురించే మాట్లాడుకుంటున్నారు !
‘కుబేర’ లో ధనుష్ పోషించిన దేవా పాత్ర గురించి మాట్లాడకపోతే.. ఈ సినిమా గురించి చర్చే అసంపూర్ణం. బిచ్చగాడి రోల్లో ధనుష్ నటన చూస్తే, అది కేవలం యాక్టింగ్ కాదు, ఆ పాత్రలో జీవించడమే అని చెప్పాలి.;
ధనుష్... ఈ పేరు వినగానే భారతీయ సినిమా అభిమానుల మనసులో ఓ అద్భుతమైన నటనా శైలి, ఎమోషన్స్‌ను పండించే విశ్వరూపం కనిపిస్తుంది. ఈ జనరేషన్లో ఇండియన్ సినిమాకు దొరికిన బెస్ట్ టాలెంట్‌లో ధనుష్ టాప్ లిస్ట్‌లో ఉంటాడనడంలో డౌటే లేదు. తమిళ సినిమాల్లో ఓ ఊపు ఊపిన ఈ స్టార్ యాక్టర్, తెలుగు సినిమాల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సార్’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేసిన ధనుష్, ఇప్పుడు మరోసారి ‘కుబేర’ సినిమాతో సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ మూవీ నిన్న విడుదలై, థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో దుమ్ము రేపుతోంది.
‘కుబేర’ లో ధనుష్ పోషించిన దేవా పాత్ర గురించి మాట్లాడకపోతే.. ఈ సినిమా గురించి చర్చే అసంపూర్ణం. బిచ్చగాడి రోల్లో ధనుష్ నటన చూస్తే, అది కేవలం యాక్టింగ్ కాదు, ఆ పాత్రలో జీవించడమే అని చెప్పాలి. మొదటి సీన్ నుంచి చివరి సన్నివేశం వరకూ ధనుష్ తన నటనతో స్క్రీన్‌ను ఆకట్టుకున్నాడు. దేవా పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ సీన్‌ను ఇంకో నటుడు టచ్ చేయడానికి కూడా ఆలోచిస్తాడు. అంత సాహసోపేతమైన, ఛాలెంజింగ్ రోల్‌ను ధనుష్ ఎంత సులభంగా చేశాడో.. ప్రతి ఫ్రేమ్‌లోనూ అతను దేవాగా మారిపోయాడు.
ఎమోషన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ... ప్రతీదీ అద్భుతం. ఈ సినిమాను ధనుష్ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా చెప్పడంలో ఆశ్చర్యం లేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ధనుష్ నటన గురించే మాట్లాడుకుంటున్నారు. శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర’ మూవీలో.. ధనుషే హైలైట్.
నాగార్జున దీపక్ పాత్రలో తనదైన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్తో మెప్పించాడు. రష్మిక మందన్న హీరోయిన్గా కనిపించి, తన పాత్రకు న్యాయం చేసింది. అయితే, సినిమా మొత్తం మీద ధనుష్‌దే హవా. రాక్‌స్టార్ డీఎస్పీ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఎమోషనల్ డెప్త్ యాడ్ చేసాయి. థియేటర్లలో కుబేర ఫీవర్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ సినిమా గురించి, ముఖ్యంగా ధనుష్ పెర్ఫార్మెన్స్ గురించి ట్రెమెండస్ బజ్ నడుస్తోంది.