‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ టీజర్ పై క్రేజీ అప్డేట్!
By : Surendra Nalamati
Update: 2025-02-27 11:11 GMT
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నుంచి రాబోతున్న క్రేజీ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. ఈ మూవీలో అజిత్ కి జోడీగా త్రిష నటిస్తుంది. తమిళంలో ‘మార్క్ ఆంటోని‘ మూవీతో బడా హిట్ అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
రేపు (ఫిబ్రవరి 28)న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ నుంచి టీజర్ రాబోతుంది. 1 నిమిషం 34 సెకన్ల నిడితో ఈ టీజర్ ఉంటుందట. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. మరోవైపు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు? అనే దానిపైనా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. టీజర్ రిలీజ్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది