యూఎస్ ప్రీమియర్స్ లో ఎవరిది పై చేయి?
అమెరికాలో రజనీకాంత్ అభిమానులు.. పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ఇది హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్‌ల కలయిక స్టార్ పవర్ ఉన్నప్పటికీ "వార్ 2" ఆధిపత్యాన్ని సవాలు చేయవచ్చు.;
అమెరికా మార్కెట్‌లో "కూలీ, వార్ 2" సినిమాల మధ్య పెద్ద పోటీ నెలకొంది. ఈ రెండు స్టార్-స్టడెడ్ చిత్రాలు ఆగస్టు 14, 2025న విడుదల కానున్నాయి. అంతకుముందు రోజు నార్త్ అమెరికా అంతటా ప్రీమియర్ షోలు షెడ్యూల్ అయ్యాయి. ఈ రెండు పెద్ద సినిమాలు ఒకే రకమైన ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నందున, ప్రీమియర్ షో ఆదాయం మీద ప్రభావం పడే అవకాశం ఉంది. రజనీకాంత్ అక్కడ ఓపెనింగ్స్‌లో కింగ్ గా పేరుగాంచారు. ఆయన సినిమాలు సాధారణంగా ప్రీమియర్ షోలలో అద్భుతంగా ఆదరణ పొందుతాయి.
మరోవైపు.. ఎన్టీఆర్ చివరి చిత్రం "దేవర" అమెరికాలో ప్రీమియర్‌ల నుంచి 2.7 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. హృతిక్ రోషన్ కూడా ఉండడం వల్ల "వార్ 2" కూడా ఈ సంఖ్యను అధిగమించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అయితే, "కూలీ" నుంచి గట్టి పోటీ ఎదురవడంతో ఆ అవకాశాలు కొంత మందగించే సూచనలు కనిపిస్తున్నాయి.
"వార్ 2" నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఐమ్యాక్స్ స్క్రీన్స్ కోసం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది వసూళ్ళను బాగా పెంచే అవకాశం ఉంది. అది కూడా ప్రేక్షకుల ఆదరణ బాగుంటేనే. అయినప్పటికీ.. అమెరికాలో రజనీకాంత్ అభిమానులు.. పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ఇది హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్‌ల కలయిక స్టార్ పవర్ ఉన్నప్పటికీ "వార్ 2" ఆధిపత్యాన్ని సవాలు చేయవచ్చు. మరి ఈ రెండు సినిమాల్లో యూయస్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.