'జాలీగా రండి.. జాలీగా వెళ్లండి..' అంటోన్న ధనుష్!
'జాలీగా రండి.. జాలీగా వెళ్లండి..' అంటోన్న ధనుష్!తమిళ విలక్షణ నటుడు ధనుష్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు. తాజాగా దనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన 'గోల్డెన్ స్పారో' సాంగ్ కి మంచి స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజయ్యింది. ట్రైలర్ ను చూస్తుంటే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కినట్టు అర్థమవుతుంది. ధనుష్ ఈ సినిమాలో కేమియోలో నటించినట్టు తెలుస్తోంది. ట్రైలర్ చివరిలో ధనుష్ చెప్పిన 'జాలీగా రండి.. జాలీగా వెళ్లండి..' అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పవీష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. నేటి యువతను టార్గెట్ చేస్తూ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ధనుష్ తెరకెక్కించిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు మంత్రముగ్ధులను చేయనుందనే ఆసక్తి నెలకొంది.