తమిళనాడు నుంచి అజిత్ కుమార్ కి పద్మభూషణ్!

ఈ రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తమిళనాడు నుంచి అజిత్ కు పద్మభూషణ్ అవార్డు లభించింది.;

By :  K R K
Update: 2025-01-25 16:31 GMT

తమిళ చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకుల్లో అజిత్‌ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. మాస్‌ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అల్టిమేట్ స్టార్ అజిత్ కుమార్. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తమిళనాడు నుంచి అజిత్ కు పద్మభూషణ్ అవార్డు లభించింది.

తెరపైనే కాదు.. తెరవెనుక కూడా సాహసాలు చేయడంలో కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ రూటే సెపరేటు. వివిధ రంగాలలో ఎంతో ఉన్నత స్థానాలు సంపాదించిన ఘనత అజిత్ సొంతం. అంతర్జాతీయ స్థాయిలో ఫార్ములా ఛాంపియన్ షిప్స్ లో ప్రొఫెషనల్ రేసర్ గా పాల్గొన్న అజిత్.. చెన్నై రైఫ్ల్స్ క్లబ్ లో షూటర్ గానూ ట్రైనింగ్ తీసుకున్నాడు. పాకశాస్త్రంలో మంచి ప్రావీణ్యత కూడా ఈ స్టైలిష్ హీరో సొంతం. అలాగే పైలట్ లైసెన్స్ కూడా పొందిన అజిత్.. మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హెలికాప్టర్ టెస్ట్ పైలట్ అండ్ యు.ఎ.వి. సిస్టమ్ అడ్వైజర్ గా ఉద్యోగాన్ని పొందాడు.

ప్రస్తుతం మగిల్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన ‘విడా ముయర్చి‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తెలుగులో పట్టుదల పేరుతో వస్తుంది. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చివరి దశ చిత్రీకరణలో ఉంది.

Tags:    

Similar News