‘జైలర్ 2’ లో క్రేజీ బాలీవుడ్ బ్యూటీ?
తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ విద్యా బాలన్ ఈ సీక్వెల్‌లో కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. విద్యా బాలన్ అద్భుతమైన నటి.;
సూపర్‌స్టార్ రజనీకాంత్ తన యాక్షన్ డ్రామా ‘కూలీ’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. అదే రోజు ఈ చిత్రం యన్టీఆర్, హతిక్ రోషన్ బాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘వార్ 2’ తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. ‘కూలీ’ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
‘జైలర్’ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ‘జైలర్ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ విద్యా బాలన్ ఈ సీక్వెల్‌లో కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. విద్యా బాలన్ అద్భుతమైన నటి. ఆమె ఈ చిత్రంలో చేరితే అది సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
అలాగే.... నాగార్జున అండ్ బాలకృష్ణ కూడా ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో భాగమైనట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు నెల్సన్ ఈ స్క్రిప్ట్‌పై చాలా కాలంగా కసరత్తు చేస్తూ.. బెటర్ ఔట్‌పుట్ ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మరి విద్యాబాలన్ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.