ఆ ఒక్క సన్నివేశాన్ని వాడుతున్నారా?

"భగవంత్ కేసరి" చిత్రంలోని గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అనే భావోద్వేగభరిత సన్నివేశాన్ని "జననాయకన్" చిత్రంలో వాడుకోవాలని విజయ్ భావించారు.;

By :  K R K
Update: 2025-05-20 01:07 GMT

ఇళయదళపతి విజయ్ నటిస్తున్న "జననాయకన్" సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం "భగవంత్ కేసరి" ని రీమేక్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో, ఈ వార్తలపై అసలు సంగతులు బయటకు వచ్చాయి. ఈ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని సంప్రదించినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.

అయితే రీమేక్ జరుగుతోందన్న విషయాన్ని ఆయన స్పష్టంగా ధృవీకరించ కపోయినా, ఖండించలేదు కూడా. తాజాగా "జననాయకన్" సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రం పూర్తిగా రాజకీయ నేపథ్యంతో కూడిన సామాజిక సందేశం ఉన్న డ్రామాగా రూపొందుతుంది. దీనికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తుండగా, కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి.

ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. "భగవంత్ కేసరి" చిత్రంలోని గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అనే భావోద్వేగభరిత సన్నివేశాన్ని "జననాయకన్" చిత్రంలో వాడుకోవాలని విజయ్ భావించారు. బాలయ్య , శ్రీలీలలపై చిత్రీకరించిన ఆ ఎమోషనల్ ఎపిసోడ్‌ విజయ్‌ను బాగా ప్రభావితం చేసింది. ఆ ఒక్క ఎపిసోడ్‌ను వాడుకోవడానికి చిత్రబృందం పూర్తిగా "భగవంత్ కేసరి" రీమేక్ హక్కులను సుమారు రూ. 4.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాత సాహు గారపాటి ధృవీకరించారు.

"జననాయకన్" సినిమా సంక్రాంతి 2026 నాటికి విడుదల కానుంది. ఈ చిత్రం విజయ్ నటనలో చివరిది అవుతుంది. తర్వాత ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారని సమాచారం. సో.. క్లియర్ గా చెప్పాలంటే, "జననాయకన్" కు "భగవంత్ కేసరి" చిత్రానికి సంబంధం ఉన్నది ఆ ఒక్క భావోద్వేగ సన్నివేశమే. మిగిలిన కథ అంతా పూర్తిగా కొత్తదే.

Tags:    

Similar News