ధనుష్ డైరెక్షన్ లో అజిత్ సినిమా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రీసెంట్ గా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ తరం యువతను ఆకట్టుకునే ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది. తదుపరిగా అతడి దర్శకత్వంలోనే "ఇడ్లీ కడై" ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇంక ఇప్పుడు అభిమానులకు ఒక అదిరిపోయే న్యూస్. ధనుష్ మరో కొత్త సినిమాను డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది కూడా తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ధనుష్ స్వంత నిర్మాణ సంస్థ "వండర్‌బార్ ఫిల్మ్స్" నిర్మించనుందని, అందుకు సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించనున్నట్లు సమాచారం.
అయితే, ఈ సినిమా గురించి ధనుష్ లేదా అజిత్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ, వీరిద్దరి కలయికపై ఉన్న హైప్ ప్రేక్షకులను ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక, ధనుష్ దర్శకత్వం వహించిన "ఇడ్లీ కడై" ఏప్రిల్ 10, 2025న విడుదల కావాల్సి ఉంది. కానీ అదే రోజున అజిత్ నటించిన "గుడ్ బ్యాడ్ అగ్లీ" కూడా రిలీజ్ కానుండటంతో "ఇడ్లీ కడై" విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.