ఘనంగా అభినయ వివాహం !
తాజాగా వీరి వివాహం జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.;
సినిమాల్లో అభినయ నటన చూసినవారికి, ఆమెకు మాటలు రావు, వినపడదని తెలిసినపుడు నిజంగా ఆశ్చర్యమే కలుగుతుంది. కానీ ఆమె అభినయం మాత్రం అంతటా ప్రసిద్ధి. భగవంతుడు వరంగా ఇచ్చిన ప్రతిభ ఆమెకు శబ్దం లేకున్నా, కేవలం ముఖకవళికలు, చేతుల సైగలతో భావాలు వ్యక్తీకరించే ఈమెకి ప్రేక్షకుల మెప్పు దక్కడం సహజమే. ఆమె చెప్పేదాన్ని అభినయ అసిస్టెంట్ అర్థవంతంగా వివరిస్తూ, ఆమె భావాన్ని చేరవేస్తుంటాడు.
ఇకపోతే, అభినయ మీద కూడా ఇండస్ట్రీలో గాసిప్స్ లేకపోలేదు. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా దగ్గరలోనే ఉందని ఎన్నోసారి వార్తలు రాగా.. "మార్క్ ఆంటోనీ" సినిమా సమయంలో వీరిద్దరూ కలిసి నటించడంతోనే ఈ రూమర్స్ వెలుగులోకి వచ్చాయి. అయితే, వీటన్నింటినీ ఇద్దరూ స్పష్టంగా ఖండించారు.
ఇటీవల మాత్రం అభినయ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంగేజ్‌మెంట్ రింగ్స్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ, త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నానని ఓ హింట్ ఇచ్చింది. ఈ ఫొటోలపై ఆసక్తి పెరిగిన కొద్దిసేపటికే, తన కాబోయే భర్త గురించిన వివరాలు వెల్లడించింది.
హైదరాబాద్‌కు చెందిన వీ. కార్తీక్ అలియాస్ సన్నీ వర్మతో అభినయ వివాహం నిశ్చయమైంది. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. దాదాపు 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం సన్నీ వర్మ హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఎంఎన్‌సీ సంస్థలో కీలక పదవిలో పనిచేస్తున్నారు.
తాజాగా వీరి వివాహం జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నెల 20న హైదరాబాద్‌లోనే గ్రాండ్ రిసెప్షన్ జరగనుండగా, టాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరవుతున్న అవకాశాలు కనిపిస్తున్నాయి.