‘96’ సీక్వెల్ కు సేమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

“96 సీక్వెల్ కథను నేను రాసుకున్నాను. నటీనటుల విషయానికొస్తే, మొదటి భాగంలో కనిపించిన వారు తమ పాత్రలను మళ్లీ పోషిస్తారు. ఆ విషయంలో ఎటువంటి మార్పు లేదు” అని ఆయన తెలిపారు.;

By :  K R K
Update: 2025-03-30 01:44 GMT

సెంటిమెంట్, రొమాన్స్ పరంగా ‘96’ మూవీతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న విజయ్ సేతుపతి, త్రిష జంట మరోసారి తెరపై కనిపించనుందా? 2018లో విడుదలైన '96' సినిమా అప్పటి నుంచి సంచలన ప్రేమకథగా పేరుపొందింది. ఈ సినిమాకు ఓ సీక్వెల్ రాబోతుందన్న వార్త అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తాజాగా ఓ అవార్డ్ వేడుకలో పాల్గొన్న దర్శకుడు సీక్వెల్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. “96 సీక్వెల్ కథను నేను రాసుకున్నాను. నటీనటుల విషయానికొస్తే, మొదటి భాగంలో కనిపించిన వారు తమ పాత్రలను మళ్లీ పోషిస్తారు. ఆ విషయంలో ఎటువంటి మార్పు లేదు” అని ఆయన తెలిపారు.

ఇది విన్న తర్వాత, విజయ్ సేతుపతి, త్రిష మళ్లీ రామ్, జాను పాత్రల్లో కనిపించనున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, దర్శకుడు వారి పేర్లను స్పష్టంగా ప్రస్తావించకపోయినప్పటికీ, వీరు తిరిగి తమ పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేగాక, 2024లో ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు విజయ్ సేతుపతి సతీమణికి ఈ కథ చెప్పగా, ఆమెకు చాలా నచ్చిందని కూడా వెల్లడించారు.

‘96’ చిత్రం స్కూల్ డేస్ ప్రేమను, కాలం గడిచిన తర్వాత ఆ ప్రేమ మళ్లీ ఎలా గుర్తుకు వస్తుందనే భావోద్వేగాన్ని అందంగా ఆవిష్కరించింది. స్కూల్ చదువుకునే రోజులలో ప్రేమలో పడిన ఇద్దరూ, అనివార్య కారణాల వల్ల విడిపోతారు. కొన్నేళ్ల తర్వాత స్కూల్ రీయూనియన్‌లో కలుసుకుని గతాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ, ఆ ప్రేమకు ముగింపు దొరికిందా? లేదా? అనేదే సినిమా హైలైట్. ‘96’ సీక్వెల్‌తో ప్రేక్షకులు మరోసారి రామ్-జాను ఎమోషనల్ జర్నీని ప్రేక్షకులు ఆస్వాదించే అవకాశముందా? అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News