వంద కోట్ల దిశగా ‘హిట్ 3‘

నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది.;

By :  S D R
Update: 2025-05-04 10:17 GMT

నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాని ఇచ్చిన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కలెక్షన్ల పరంగా ‘హిట్ 3‘ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.

నాని ‘హిట్ 3‘ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. తొలి రోజు రూ.43 కోట్లు వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండు రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్లు కొల్లగొట్టింది. లేటెస్ట్ గా ‘హిట్ 3‘ మూడు రోజుల వసూళ్లను ప్రకటించింది టీమ్. ఈ సినిమా మూడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.82 కోట్లు వసూళ్లను సాధించింది.

మరోవైపు అమెరికాలో 2 మిలియన్ డాలర్ల దిశగా దూసుకెల్తుంది. మొత్తంగా ఈ ఆదివారంతో ‘హిట్ 3‘ వంద కోట్ల క్లబ్ లోకి ఎంటరవుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

Tags:    

Similar News