‘డిస్కో డ్యాన్సర్’ గా అల్లు అర్జున్?

బాలీవుడ్‌లో ఓ నిర్మాత ‘డిస్కోడాన్సర్’ సీక్వెల్‌ను అల్లు అర్జున్‌తో తీయాలని ఆశిస్తున్నారు. 1982లో విడుదలైన ‘డిస్కో డాన్సర్’ చిత్రంలో మిథున్ చక్రవర్తి హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.;

By :  K R K
Update: 2025-08-17 06:13 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం కోసం బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతున్న ఈ ఫ్యూచరిస్టిక్ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు అల్లు అర్జున్ కొత్త సినిమాలు సైన్ చేయడం లేదు. అయితే, బాలీవుడ్‌లో ఓ నిర్మాత ‘డిస్కోడాన్సర్’ సీక్వెల్‌ను అల్లు అర్జున్‌తో తీయాలని ఆశిస్తున్నారు. 1982లో విడుదలైన ‘డిస్కో డాన్సర్’ చిత్రంలో మిథున్ చక్రవర్తి హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

స్ట్రీట్ సింగర్ జిమ్మీ స్టార్‌డమ్‌ను అందుకునే ప్రయాణాన్ని ఈ చిత్రం చూపించింది. దర్శకుడు సుభాష్ ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కథ రాయడానికి విజయేంద్ర ప్రసాద్‌ను ఎంపిక చేశారు. ఈ సీక్వెల్‌లో రణబీర్ కపూర్ లేదా అల్లు అర్జున్‌లలో ఒకరిని హీరోగా తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నారు. కాపీరైట్ సమస్యల కారణంగా ఈ సినిమా గతంలో కొన్ని చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ కోర్టు సుభాష్‌కు సినిమామీద హక్కు ఉందని తీర్పు ఇచ్చింది.

“విజయేంద్ర ప్రసాద్‌ను కథ, స్క్రీన్‌ప్లే రాయమని కోరాము. మా సహ నిర్మాత నాపై కేసు వేసినప్పుడు ఆయన కథ రాస్తున్నారు. నేనే సినిమాను డైరెక్ట్ చేయొచ్చు కానీ హీరోగా ఎంపికైన నటుడిపై ఆధారపడి తుది నిర్ణయం ఉంటుంది,” అని దర్శకుడు ఇటీవల వెల్లడించారు. ఈ సినిమాను రష్యాలో షూట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. మూడు లేదా నాలుగు అంతర్జాతీయ సంగీత ఐడల్స్‌తో పాటు రష్యన్ సంగీత బృందాలను కూడా పాటల కోసం రప్పించాలని భావిస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Tags:    

Similar News