చారిత్రక చిత్రాలకు స్థానం దక్కలేదు
చారిత్రక చిత్రాలకు స్థానం దక్కలేదుగద్దర్ అవార్డుల్లో స్థానం దక్కించుకోలేకపోయిన సినిమాలలో చారిత్రక చిత్రాలైన చిరంజీవి ‘సైరా..‘, బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి‘ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో చేసిన ‘ఖైదీ నంబర్ 150‘ ఘన విజయాన్ని సాధించింది. చిరంజీవి కెరీర్ లో ఇది 150వ చిత్రం.
ఈ సినిమాతో పాటే వచ్చిన బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి‘ కూడా ఘన విజయాన్ని సాధించింది. ఆ ఏడాది సంక్రాంతికి ఈ రెండు సినిమాలతో పాటు వచ్చిన శర్వానంద్ ‘శతమానం భవతి‘కి ఉత్తమ చిత్రంగా గద్దర్ అవార్డు లభించింది.
అయితే వీటిలో బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి‘కి అవార్డు వస్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. అలాగే చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేసిన చారిత్రక చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి‘కి అవార్డుల్లో స్థానం దక్కలేదు. అయితే చిరు ‘సైరా..‘, బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి‘ రెండు సినిమాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన చారిత్రక కథలే కాబట్టి.. ఈ సినిమాలకు అవార్డులు రాలేదేమో అనేది మరో విశ్లేషణ.