'ఆర్య 2' రీ-రిలీజ్‌కు గ్రాండ్ రెస్పాన్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జోడీ కలిసి 2009లో తెరపైకి తెచ్చిన ‘ఆర్య 2’ అప్పట్లోనే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.;

By :  S D R
Update: 2025-04-02 00:36 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జోడీ కలిసి 2009లో తెరపైకి తెచ్చిన ‘ఆర్య 2’ అప్పట్లోనే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా కథ, సంగీతం, స్టైల్—అన్నీ కలిసి ప్రేక్షకులకు ఓ కొత్త తరహా వినోదాన్ని కలిగించాయి.

ఇప్పుడు రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తుండటంతో ‘ఆర్య 2’ను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం వచ్చింది. ఏప్రిల్ 5న ఈ చిత్రం గ్రాండ్ రీ-రిలీజ్ కానుంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్‌పై అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. హైదరాబాద్ సంధ్య 35 ఎంఎం థియేటర్‌లో టికెట్లు కేవలం 2 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ కావడం ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకునేలా చేస్తోంది.

అల్లు అర్జున్ స్టైల్, సుకుమార్ స్టోరీ టెల్లింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కలగలిసిన ఈ సినిమా మళ్లీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ రీ-రిలీజ్ సందర్భంగా కొత్తగా కట్ చేసిన 'ఆర్య-2' ట్రైలర్ ఇప్పటికే అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. రీ-రిలీజ్‌తో ‘ఆర్య 2’ మరోసారి బిగ్ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర బృందం కాన్ఫిడెంట్‌గా ఉంది.


Full View


Tags:    

Similar News