ప్రమోషన్స్ షురూ చేసిన సందీప్ కిషన్

ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో సందీప్ కిషన్ ‘మజాకా‘ ఒకటి. డైరెక్టర్, రైటర్ డ్యూయో నక్కిన త్రినాథరావు, ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.;

By :  S D R
Update: 2025-01-29 07:45 GMT

ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో సందీప్ కిషన్ ‘మజాకా‘ ఒకటి. డైరెక్టర్, రైటర్ డ్యూయో నక్కిన త్రినాథరావు, ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. నక్కిన గత చిత్రాల తరహాలోనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. సందీప్ కిషన్ తో పాటు.. ఈ మూవీలో రావు రమేష్ మరో ప్రధాన పాత్రలో అలరించబోతున్నాడు. సందీప్ కి జోడీగా రితూ వర్మ, రావు రమేష్ కి పెయిర్ గా ‘మన్మథుడు‘ భామ అన్షు కనిపించబోతున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘మజాకా‘ టీజర్ ఆకట్టుకుంంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘బ్యాచిలర్స్ ఏంథెమ్‘ పేరుతో సింగిల్ రిలీజ్ చేశారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ లో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ధనుంజయ్ సీపాన పాడాడు. బ్యాచిలర్స్ లైఫ్ గురించి సందీప్ కిషన్, రావు రమేష్ పాడుకునే గీతంగా ఈ పాట సినిమాలో ఉండబోతుంది. రఘు మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందిన ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ‘మజాకా‘ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 21న ‘మజాకా‘ విడుదలకు ముస్తాబవుతుంది.


Full View


Tags:    

Similar News