ఉగ్రదాడిని ఖండించిన చలన చిత్ర వాణిజ్య మండలి

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి.;

By :  S D R
Update: 2025-04-23 15:44 GMT

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ.అమాయక పర్యాటకులపై జరగిన ఈ అమానుష చర్యలో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసి మేం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాము అని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ప్రెస్ నోట్ జారీ చేసింది.

'ఈ క్రూర చర్యను మేము మానవత్వానికి తీవ్రమైన అవమానంగా భావిస్తున్నాము. బాధిత కుటుంబాలకు మనఃపూర్వక సానుభూతిని తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము.' అని ప్రెస్ నోట్ లో తెలిపింది. 'తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ శాంతి, మానవతా విలువలు, సామరస్యానికి అండగా నిలుస్తుంది. ఈ దాడి వెనుక ఉన్న దోషులు కఠినంగా శిక్షించబడాలని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మేము కోరుతున్నాము.' అని ఈ నోట్ లో తెలిపింది.

Tags:    

Similar News