‘భైరవం‘ నుంచి ఫెస్టివల్ సాంగ్

మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ‘భైరవం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని రూపొందించాడు.;

By :  S D R
Update: 2025-05-11 06:54 GMT

మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ‘భైరవం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని రూపొందించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా థర్డ్ సింగిల్ గా ‘దమ్ దమ్మారే‘ అంటూ సాగే గీతం విడుదలైంది.

ముగ్గురు హీరోలు కలిసి సందడి చేస్తున్న ఈ పాట ఫెస్టివల్ మూడ్ లో ఆకట్టుకుంటుంది. భాస్కరభట్ల రాసిన ఈ గీతాన్ని రేవంత్, సాహితీ చాగంటి, సౌజన్య భాగవతుల ఆలపించారు.

ఈ మూవీలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై, జయసుధ, అజయ్, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ ‘గరుడన్‘ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. మే 30న గ్రాండ్ లెవెల్ లో ‘భైరవం‘ రిలీజ్ కు రెడీ అవుతుంది.


Full View


Tags:    

Similar News