ఫాదర్-డాటర్ మ్యాజిక్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ SSMB29 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ మరోవైపు పలు అడ్వర్‌టైజ్‌మెంట్స్ తో ఫ్యాన్స్ ను మురిపిస్తూనే ఉంటాడు. లేటెస్ట్ గా మహేష్ ఫ్యాన్స్ కు ఓ సర్ప్రైజింగ్ గిఫ్ట్ వచ్చింది.;

By :  S D R
Update: 2025-03-21 02:04 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ SSMB29 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ మరోవైపు పలు అడ్వర్‌టైజ్‌మెంట్స్ తో ఫ్యాన్స్ ను మురిపిస్తూనే ఉంటాడు. లేటెస్ట్ గా మహేష్ ఫ్యాన్స్ కు ఓ సర్ప్రైజింగ్ గిఫ్ట్ వచ్చింది. మహేష్, తన కుమార్తె సితార కలిసి నటించిన ట్రెండ్స్ షోరూమ్ యాడ్ ఆకట్టుకుంటుంది.

మహేష్, సితార ఒకే స్క్రీన్‌పై కలిసి కనిపించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ప్రకటనలో మహేష్ స్టైలిష్ లుక్స్‌లో మెరిసిపోగా, సితార అందమైన వేషధారణలో ఆకట్టుకుంది. యూత్‌ ట్రెండ్‌లో ఉన్న కొత్త పదాలను తన తండ్రికి నేర్పించే విధానం ఈ యాడ్ లో సమ్‌థింగ్ స్పెషల్.

ఇక SSMB29 విషయానికి వస్తే, ఈ చిత్రం ఇటీవల ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Full View


Tags:    

Similar News