దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార‘ ప్రారంభం
పేరుకు మలయాళీ అయినా తెలుగులో సూపర్ హిట్ ట్రాక్ రికార్డు సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‘ చిత్రాలు ఒకటి తర్వాత మరొకటిగా భారీ విజయాలు సాధించాయి. తాజాగా దుల్కర్ సల్మాన్ తెలుగులో ‘ఆకాశంలో ఒక తార‘ అంటూ మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు.;
By : S D R
Update: 2025-02-02 11:30 GMT
పేరుకు మలయాళీ అయినా తెలుగులో సూపర్ హిట్ ట్రాక్ రికార్డు సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‘ చిత్రాలు ఒకటి తర్వాత మరొకటిగా భారీ విజయాలు సాధించాయి. తాజాగా దుల్కర్ సల్మాన్ తెలుగులో ‘ఆకాశంలో ఒక తార‘ అంటూ మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు.
పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ ముందుకొచ్చాయి. ఈ రెండు అగ్ర నిర్మాణ సంస్థలతో పాటు లైట్ బాక్స్ నిర్మాణ సంస్థపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘ఆకాశంలో ఒక తార‘ చిత్రం ఈరోజు ముహూర్తాన్ని జరుపుకుంది.