DSP ఫామ్ లోకి వచ్చేశాడు!

కొన్ని నెలల క్రితం దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ లో మ్యాజిక్ మిస్ అయ్యిందనే విమర్శలు గట్టిగా వినిపించాయి. 'కంగువా' సౌండ్‌ట్రాక్ ఈ అభిప్రాయాలకు బలం చేకూర్చినట్టు అభిమానులు భావించారు.;

By :  S D R
Update: 2025-06-26 01:35 GMT

కొన్ని నెలల క్రితం దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ లో మ్యాజిక్ మిస్ అయ్యిందనే విమర్శలు గట్టిగా వినిపించాయి. 'కంగువా' సౌండ్‌ట్రాక్ ఈ అభిప్రాయాలకు బలం చేకూర్చినట్టు అభిమానులు భావించారు. మ్యూజిక్‌లో ఫ్రెష్‌నెస్ లేదని, ట్యూన్స్ బోర్‌గా మారాయని కామెంట్లు వచ్చాయి. ఒక దశలో దేవిశ్రీ కెరీర్ డౌన్‌ టర్న్‌లో ఉందనే ఫీలింగ్ స్పష్టమైంది.

అయితే ఆ విమర్శలన్నిటికీ ‘పుష్ప 2: ది రూల్’ ఒక్కటే సమాధానంగా నిలిచింది. సుకుమార్ – దేవిశ్రీ కాంబో మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేసింది. 'పుష్ప 2' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో వేరే సంగీత దర్శకుడు ఆన్‌బోర్డులోకి వచ్చినా.. తన మార్క్ ను మాత్రం స్పష్టంగా చూపించాడు. ఈ చిత్రంలోని సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరోసారి దేవిశ్రీ మాయాజాలాన్ని చూపించాయి. 'పుష్ప 2' విజయం వెనుక దేవిశ్రీ పాటలు, స్కోర్‌ చాలా కీలక పాత్ర పోషించాయి.

అదే జోరులో వచ్చిన 'తండేల్'లోనూ తన మార్క్ స్పష్టంగా చూపించాడు. ఎమోషనల్ లవ్ స్టోరీగా వచ్చిన 'తండేల్'కి పాటలు ప్రధాన బలంగా నిలిచాయి. ఒక విధంగా 'తండేల్' విజయంలో మేజర్ క్రెడిట్ మ్యూజిక్ దే. ఇప్పుడు 'కుబేర'తో హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు రాక్ స్టార్.

'కుబేర' సినిమాలో దేవిశ్రీ బీట్స్, థీమ్ స్కోర్ లు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. 'ట్రాన్స్ ఆఫ్ కుబేర, పోయి రా మామ' పాటలకు వస్తోన్న స్పందన అద్భుతం. ఈ థీమ్స్ ను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. మొత్తంగా.. హ్యాట్రిక్ హిట్స్ తో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

Tags:    

Similar News