‘కాంతార’ని వెంటాడుతున్న విపత్తులు!

రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘కాంతార: చాప్టర్ 1’ పదే పదే ప్రమాదాలతో వార్తల్లో నిలుస్తోంది. గతంలో ‘కాంతార’ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఇప్పుడు ప్రీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి.;

By :  S D R
Update: 2025-06-16 01:08 GMT

రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘కాంతార: చాప్టర్ 1’ పదే పదే ప్రమాదాలతో వార్తల్లో నిలుస్తోంది. గతంలో ‘కాంతార’ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఇప్పుడు ప్రీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. అయితే షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ చిత్రాన్ని అనుకోని శాపాలు వెంటాడుతున్నట్లుగా అనిపిస్తోంది.

తాజాగా కర్ణాటకలోని మణి జలాశయంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో, రిషబ్ శెట్టి సహా 30 మంది ఉన్న పడవ నీటిలో మునిగిపోయింది. మెలినా కొప్ప వద్ద ఘటన చోటుచేసుకోగా, లోతు తక్కువగా ఉండటంతో వారందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడం ఊపిరి పీల్చేలా చేసింది. అయితే పలు కెమెరాలు, పరికరాలు మాత్రం నీటిలో కొట్టుకుపోయాయి.

ఇది చిన్న ఘటనగా అనిపించవచ్చు కానీ, గతంలో జరిగిన మరికొన్ని ఘటనలతో కలిపి చూస్తే ఇది ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారి తీసింది. గతంలో జూనియర్ ఆర్టిస్టుల వ్యాన్‌కు యాక్సిడెంట్ జరిగింది. మే 2024లో నటుడు కపిల్ నదిలో మునిగి మృతి చెందారు. అదే నెలలో రాకేష్ పూజారి గుండెపోటుతో మృతి. ఇటీవల మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజా గుండెపోటుతో కన్నుమూత.

ఈ వరుస ప్రమాదాలతో చిత్రబృందం గందరగోళానికి గురవుతుంది. సోషల్ మీడియాలో 'పంజుర్లి దేవతా' హెచ్చరికలు నిజమవుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు సినిమాపై శాపం పడిందని పుకార్లు పుట్టించగా, మరికొందరు దీన్ని ఒట్టి పుకార్లుగానే కొట్టిపారేస్తున్నారు.

Tags:    

Similar News