సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీ – ఎప్పుడు సెట్స్‌పైకి?
తెలుగు సినిమాల కంటెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే తెలుగు దర్శకులతో పనిచేయడానికి పరభాషా కథానాయకులు పోటీ పడుతున్నారు.;
తెలుగు సినిమాల కంటెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే తెలుగు దర్శకులతో పనిచేయడానికి పరభాషా కథానాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే తమిళం నుంచి ధనుష్, మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్ వంటి వారు వరుసగా తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ తో అలరిస్తున్నారు.
ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయాలని గడిచిన కొన్ని సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాడు. ఇప్పటికే సూర్యతో సినిమాకోసం త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను వంటి దర్శకుల పేర్లు వినిపించాయి. లేటెస్ట్ గా ఈ లిస్టులోకి చందూ మొండేటి కూడా చేరాడు.
సూర్యతో సినిమా విషయం 'తండేల్' ప్రమోషన్స్ లో బయట పెట్టాడు చందూ మొండేటి. 'కార్తికేయ 2' తర్వాత సూర్య తనతో మాట్లాడారని.. ఆయనకు తాను రెండు కథలు వినిపించానని చందూ మొండేటి తెలిపాడు. రెండు కథలు ఆయనకు నచ్చాయి.. అయితే తమ కాంబోలో ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్ అవుతోంది? అనేది చూడాలి అంటూ సూర్యతో సినిమా గురించి చందూ వెల్లడించాడు.
ప్రస్తుతం చందూ మొండేటి ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ మూవీ తర్వాత 'కార్తికేయ 3' కూడా లైన్లో ఉంది. మరోవైపు సూర్య కూడా వరుస కమిట్‌మెంట్స్ తో బిజీగా ఉన్నాడు. మరి.. సూర్య-చందూ మొండేటి కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.