నాని 'ది ప్యారడైజ్' నుంచి క్రేజీ అప్డేట్!
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను మెప్పించడంతో పాటు పలు వేదికలపై అవార్డుల పంట పండించింది. ఇప్పుడు 'దసరా'కి మించిన రీతిలో ఈ జోడీ ‘ది ప్యారడైజ్’ పేరుతో మరో పీరియాడికల్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసింది. చార్మినార్, గన్స్ వంటి ఎలిమెంట్లను కలిపి రూపొందించిన 'ది ప్యారడైజ్' పోస్టర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.
పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న 'ది ప్యారడైజ్' మూవీని సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నాని కెరీర్‌లోనే ఇది అత్యంత ఖరీదైన సినిమాగా పేర్కొంటున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, హీరోయిన్‌గా జాన్వీ కపూర్ లేదా శ్రద్ధా కపూర్ నటించే అవకాశం ఉంది.
ఈరోజు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు. ‘రా స్టేట్‌మెంట్’ పేరుతో రూపొందిన టీజర్‌ను మార్చి 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అత్యున్నత సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న ఈ సినిమా నాని కెరీర్‌లోనే మోస్ట్ వయలెంట్ మూవీగా నిలవనుందని చెబుతున్నారు మేకర్స్.